కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ మళ్లీ తనకే పార్టీ అభ్యర్ధిత్వం ఖరారు అవుతుందన్న భావిస్తుండగా, మరో నలుగురు నేతలు 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ నాయకులు నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పార్టీలో నాలుగు వర్గాలు అయ్యాయి. దీంతో ఎవరి అభ్యర్ధిత్వం ఖరారు అవుతుందో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు డైలమాలో ఉన్నారు. నియోజకవర్గ వైసీపీ నేత, కూడా చైర్మన్ కోట్ల హర్షవర్థన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్ మధ్య వైరం నెలకొని ఉండటంతో గ్రూపు రాజకీయాలు పెరిగాయని అంటున్నారు. హర్షవర్థన్ రెడ్డి ఆశీస్సులు ఉన్న వారికి మాత్రమే టికెట్ ఖరారు అవుతుందని కొందరు నేతలు పేర్కొంటున్నారు.

వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సంథ్య విక్రంకుమార్, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్, ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన లోకేష్, మరో మాజీ పోలీస్ అధికారి ఒకరు వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. వీరు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. లాంబీయింగ్ చేసుకుంటున్నారు. ఎవరికి వారు తమకే టికెట్ కన్పర్మ్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే రీసెంట్ గా ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోవాలని తాను అనుకోవడం లేదని సీఎం జగన్ పేర్కొనడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకే టికెట్ ఇస్తారన్న ధీమాతో సుధాకర్ ఉన్నారు.

మరో పక్క సర్వేలో పాజిటివ్ వస్తేనే టికెట్ ఇస్తామని పలు సందర్భాల్లో చెప్పి ఉండటం వల్ల ఇప్పటికే ఎమ్మెల్యే పని తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయని, వచ్చే ఎన్నికల్లో సుధాకర్ కు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఆయన ప్రత్యర్ది వర్గం చెబుతోంది.  దీంతో రాబోయే ఎన్నికల్లో ఎవరి అభ్యర్ధి అవుతారనేది తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరి పక్కనకు వెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇలా వైసీపీలో గ్రూపులు ఉండటం టీడీపీకి కలిసివచ్చే అంశంగా కనబడుతోందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *