Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ గా డాక్టర్ గుమ్మళ్ల సృజన ఇటీవల నియమితులైయ్యారు. తమ విధి నిర్వహణలో భాగంగా చాలా మంది ఐఏఎస్ లు జిల్లా కలెక్టర్ గా నియమితులు అవుతుంటారు. సేవలు అందిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే .. ఒక నాడు ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ గా సృజన తండ్రి గుమ్మళ్ల బలరామయ్య సేవలు అందించారు. ఇప్పుడు కలెక్టర్ గా బలరామయ్య కుమార్తె సృజన బాధ్యతలు చేపట్టారు. తండ్రి పని చేసిన జిల్లాలోనే కుమార్తె కూడా జిల్లా కలెక్టర్ హోదాలో పని చేయడం విశేషం. కర్నూలు జిల్లాకు 55వ కలెక్టర్ గా సృజన బాధ్యతలు చేపట్టారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను ప్రభుత్వం కర్నులు జిల్లా కలెక్టర్ గా నియమించింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్ లో కీలక పాత్ర పోషించారు డాక్టర్ సృజన. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పూడి గ్రామానికి చెందిన సృజన 2012 లో గ్రూప్ 1 ఎంపికై మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో సెక్రటరీ గా విధులు నిర్వహించారు. 2013 లో సివిల్స్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు ఎంపికైయ్యారు.

విధి నిర్వహణలో ఆమె అంకిత భావానికి ఇది ఒక నిదర్శనగా నిలుస్తుంది. మెటర్నిటీ లీవును రద్దు చేసుకుని మళ్లీ చంటి బిడ్డతో విధులకు హజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఆమె. కరోనా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితుల్లో డాక్టర్ సృజన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికి లాక్ డౌన్ కొనసాగుతున్నది. అంతటి విపత్కర పరిస్థితుల్లో ఆమె తన మెటర్నిటీ లీవును రద్దు చేసుకున్నారు. డెలివరీ అయిన 22 రోజుల్లోనే తిరిగి విధుల్లో చేరి ఉద్యోగులకు స్పూర్తిదాయకంగా నిలిచారు. ఆమె భర్త హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *